
అమ్మకానికి దొడ్డు బియ్యం
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో మార్చి నాటికి గోదాంల ఉన్న దొడ్డు బియ్యం నిల్వలు పురుగులు, ఎలుకలకు ఆ హారంగా మారాయి. బఫర్ గోదాంలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న బియ్యం నా ణ్యత దెబ్బతింటుంది. దీంతో వివిధ గోదాముల్లో నిల్వ ఉన్న 4,535.551 మెట్రిక్ టన్నుల దొడ్డు బి య్యం ఈ–వేలం వేయాలని నిర్ణయించింది. కిలో బియ్యాన్ని రూ.24 బేస్ ధరగా నిర్ణయించి, పారదర్శకంగా విక్రయించేందుకు విధివిధానాలు రూపొందించింది. దీంతో కొత్త యాసంగి ధాన్యం, వా నాకాలం బియ్యం నిల్వకు స్థలం లభిస్తుంది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
జిల్లాలో మిగిలి ఉన్న దొడ్డు బియ్యానికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో నిల్వ ఉన్న 4535.551 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఆదేశానుసారం విక్రయించనున్నాం.
– సుధాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్
జిల్లా వ్యాప్తంగా దొడ్డు బియ్యం నిల్వలు మెట్రిక్ టన్నుల్లో..
మాటెగాం బఫర్ గోదాం
537.698 మెట్రిక్ టన్నులు
లోకేశ్వరం బఫర్ గోదాం :
1177.470 మెట్రిక్ టన్నులు
మామడ బఫర్ గోదాం:
1988.168 మెట్రిక్ టన్నులు
జామ్ బఫర్ గోదాం :
422.690 మెట్రిక్ టన్నులు
ఎంఎల్‌ఎస్ పాయింట్లు (నిర్మల్, భైంసా, ముధోల్, ఖానాపూర్):
364.643 మెట్రిక్ టన్నులు
412 రేషన్ షాపులు:
409.525 మెట్రిక్ టన్నులు