
గంజాయి మొక్కలు పట్టివేత
తాంసి: మండలంలోని గిరిగాం గ్రామంలో అక్రమంగా ఇంటి వద్ద పెంచుతున్న గంజాయి మొక్కల ను ఎకై ్సజ్ జిల్లా టాస్క్‌ఫొర్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ అ ధికారులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన తో డసం గోపాల్ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం మేరకు సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇంటి ఆవరణలో పెంచుతున్న రెండు మొక్కలను గుర్తించారు. వీటి విలువ రూ.50 వేలు ఉంటుందని, స్వాధీనం చేసుకొని గోపాల్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. దాడులలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్, సిబ్బంది అరవింద్, మోహన్, రవీందర్, శారద, జమీర్, సతీశ్, పంచాయతీ కార్యదర్శి రవికిరణ్ ఉన్నారు.
ఇంట్లో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి తక్కెలపల్లి రాకేశ్ ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 19న కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాగా, ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న రూ.5వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఆదివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు.