
అలరించిన గుస్సాడీ నృత్యం
బాసర: ఆర్జీయూకేటీలో ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్య ప్రదర్శన విద్యార్థులు, అధ్యాపకులను ఎంతగానో ఆకట్టుకుంది. స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన శ్రీ కనక సుదర్శన్ ఆదివాసీ బృందం ఈ నృత్య ప్రదర్శన చేశారు. వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆధునిక కాలంలోనూ వారసత్వ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. డిసెంబర్ 2 నుంచి 5 వరకు తెలంగాణ రాష్ట్ర 4వ స్పిక్ మెకే సాంస్కృతిక సమ్మేళనం యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేట్ డీన్లు డా. మహేశ్, డా. విఠల్, స్పిక్ మేకే కోఆర్డినేటర్ డా. రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.