
బ్యాటరీ దొంగలు అరెస్ట్
నిర్మల్‌టౌన్: బ్యాటరీ దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై లింబాద్రి ఆదివా రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. నిర్మల్‌రూరల్ మండలం అక్కపూర్ గ్రా మానికి చెందిన తాండ్ర సాయన్న తన జేసీ బీని గ్రామ శివారులో ఉంచి వెళ్లారు. పట్టణంలోని మంజులాపూర్‌కు చెందిన అఖిల్, మహా లక్ష్మి వాడకు చెందిన నందకిషోర్‌లు జేసీబీలోని రెండు బ్యాటరీలను శనివారం రాత్రి దొంగిలించా రు. విషయం తెలుసుకున్న జేసీబీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ని అదుపులోకి తీసుకొని రెండు బ్యాటరీలను రికవరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.