
నాటి మహిషాపురం.. నేటి భైంసా పట్టణం..
భైంసా: ఒకప్పటి మహిషాపురమే నేడు భైంసా పట్టణంగా పిలుస్తున్నారు. చరిత్రను తెలిపే రాతితో చెక్కిన మహిషాపాదాలు భైంసాలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే మహిషాసుర రాక్షసుడిని దుర్గాదేవి మహిషా అవతారంలో వధించిందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు దుర్గాదేవే ప్రజలను ఆదుకున్నందుకు అప్పటి వారు రాతితో పాదాలను చెక్కించారు. ఇందుకు గుర్తుగా సమీపంలోని గుట్టపై మైసమ్మ మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో దుర్గాదేవి గట్టు మైసమ్మగా పూజలు అందుకుంటోంది. కాగా సోమవారం నుంచి భైంసా డివిజన్‌వ్యాప్తంగా భక్తులు దుర్గాదీక్షలు స్వీకరించనున్నారు.