
అక్టోబర్‌లో సోయా కొనుగోళ్లు ప్రారంభించాలి
ముధోల్: అక్టోబర్ మొదటి వారంలోనే సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు జోగినిపల్లి రాంగరావు కోరారు. ముధోల్‌లో శుక్రవారం నిర్వహించిన కిసాన్ సంఘ్ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రైతుల కష్టం ఫలితాన్ని రైతులకే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సోయా కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేస్తే, చేతికి వచ్చిన పంట నిల్వచేసే సౌకర్యం లేక, తర్వాతి పంటకు పెట్టుబడి కోసం ప్రైవేటు, మధ్యవర్తులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతారని తెలిపారు. ఇటీవలి వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మేళనంలో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు రాము, అంబీర్, ఆనంద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో కిసాన్ సంఘ్ ప్రతినిధులు