
22 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు
నిర్మల్‌టౌన్: ఈనెల 22 నుంచి జిల్లా కేంద్రంలోని శ్రీనందిగుండం దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు లక్కడి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయ ఆవరణలో ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి వైభవంగా భవానీ మాలధారణ కా ర్యక్రమం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 2న విజయదశమి వేడుకలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నవరాత్రుల్లో ప్రతీరోజు అన్నప్రసా ద వితరణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూదరి నరహరి, విలాస్, మూర్తి మాస్టర్, ఆనంద్, శివకుమార్, శ్రీను పాల్గొన్నారు.