నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 20 2025 6:58 AM | Updated on Sep 20 2025 6:58 AM

నిర్మ

నిర్మల్‌

శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

‘మహా’ వరదలతో గోదావరి ఉధృతి.. ఆందోళన చెందుతున్న పరీవాహక ప్రాంత రైతులు

ఆర్జీయుకేటీలో ఏఐపై శిక్షణ

బాసర ఆర్జీయుకేటీలో టీజీఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, ఇన్‌చార్జి వీసీ ఎ.గోవర్ధన్‌లతో కలిసి ప్రత్యేక ఇంటరా?క్టివ్‌ సదస్సు నిర్వహించారు.

IIలోu

భవిత కేంద్రంలో

సౌకర్యాల కల్పన

ఖానాపూర్‌: పట్టణంలోని భవిత విలీన విద్యావనరుల కేంద్రంలో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక అన్నారు. పట్టణంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. దివ్యాంగుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి న్యాయసేవా సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలతోపాటు వైద్యసేవలను అవసరమైన వారికి తమ సంస్థ ద్వారా అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో విలీన విద్యా జిల్లా సమన్వయకర్త ప్రవీణ్‌, రిసోర్స్‌పర్సన్లు లక్ష్మి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

భైంసారూరల్‌: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు నిర్మల్‌ జిల్లాలో వరదలకు కారణమవుతున్నాయి. గురువారం మహారాష్ట్రలో పడిన వర్షాలతో గోదా వరి ఉధృతి మరింత పెరిగింది. మూడు రోజులుగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో పరీ వాహక గ్రామాల్లోని పంటలు మళ్లీ మునుగుతున్నాయి. గతనెలలో కురిసిన వర్షాలకు రైతులు పంటలు నష్టపోయారు. తాజాగా గోదావరితోపాటు సిరాల ప్రాజెక్టు, గడ్డెన్న వాగు వంటి సాగునీటి ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీరు కూడా పరీవాహక ప్రాంతాల్లో పంటలను ముంచుతున్నాయి. మహా రాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న తానూరు, కుభీర్‌, భైంసా, ముధోల్‌, బాసర మండలాలు ఈ వర్షాల ప్రభావానికి గురయ్యాయి. గోదావరి వరద పెరగడంతో పత్తి, వరి పంటలు నీటమునిగాయి.

ఇలేగాం శివారులో నీటమునిగిన పత్తి, సోయా పంట

‘గడ్డెన్న వాగు’ గేట్లెత్తడంతో..

గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో సుద్దవాగు పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ఖథ్‌గాం, బోరిగాం, పేండ్‌పెల్లి, కామోల్‌ వంటి గ్రామాల్లో పంటలు మునిగిపోయాయి. ఈ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి వచ్చిన వరద నీరు కుభీర్‌ మండలం నిగ్వా, వాయి, లింగా, సాంవ్లీ గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది.

సిరాల ప్రాజెక్టు అలుగు ప్రభావం

సిరాల ఇరిగేషన్‌ ప్రాజెక్టు అలుగు నీటి ప్రవాహంతో ఇలేగాం, దేగాం, వాలేగాం గ్రామాల వాగులు పొంగుతున్నాయి. భారీ వర్షాలతో వచ్చిన వరద నీరు సరిహద్దు మండలాల్లోని అనేక గ్రామాల పంటపొలాలను మరోసారి ముంచెత్తింది. ఈ అలుగు నీరు రెండు రోజులపాటు పంటపొలాలను ముంచింది. శుక్రవారం సాయంత్రం వరద కాస్త తగ్గింది. పూర్తిస్థాయిలో తగ్గడానికి రెండు రోజులు పడుతుందని రైతులు పేర్కొంటున్నారు.

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement