
పీజీ కళాశాల ప్రారంభించాలి..
జిల్లాకేంద్రంలోని కాకతీయ పీజీ కళాశాలలో తరగతులను ప్రారంభించాలని ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కార్యదర్శి కై లాస్ కోరారు. ఈమేరకు కలెక్టర్ పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ డీఐఈవోను ఆదేశించారు. ఇందులో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సన్నిహిత్, అస్లాం తదితరులు ఉన్నారు.
రెగ్యులరైజ్ చేయాలి..
ప్రభుత్వం సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, కలెక్టర్‌కు వినతపత్రం ఇచ్చారు. గతేడాది నిర్వహించిన పరీక్ష ఫలితాల విడుదల, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రతలపై డిమాండ్ చేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేశ్ పేర్కొన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి సరస్వతి, కోశాధికారి సుజాత, శోభ, రాధ, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.

పీజీ కళాశాల ప్రారంభించాలి..