
పీఎం శ్రీతో విద్యాభివృద్ధికి కృషి
కడెం: పీఎం శ్రీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాయని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. ఆదివా రం మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామంలోగల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ.13.50 లక్షలతో ఏర్పాటు చేసిన సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తర్పీదు ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల భాగస్వామ్యంతో విద్యార్థులకు ఇందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తు తం ఏఐ వచ్చిందని, కాలానుగుణంగా టెక్నాలజీ నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పీఎం శ్రీ సెల్ఫీ పాయింట్ వద్దకు వెళ్లి సెల్ఫీ దిగారు. అనంతరం సారంగపూర్ గ్రామంలో రూ.12లక్షల వ్యయంతో చేపట్టిన అంగన్‌వాడీ భవ న నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎలగడపలో కటికనపెల్లి శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంఈవో షేక్ హుస్సేన్, కాంగ్రెస్, బీజేపీ మండలాధ్యక్షులు మల్లేశ్, కాశవేణి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శంకుంతల, నాయకులు బొడ్డు గంగన్న, లచ్చన్న, కోల శ్రీనివాస్, భూమేశ్, రాపర్తి శ్రీనివాస్, వెంకటేశ్, మోహన్, ప్రవీణ్ తదితరులున్నారు.
ఖానాపూర్: మండలంలోని రాజురా గ్రామంలో ని ర్మించిన ఆరోగ్యఉపకేంద్రాన్ని ఎంపీ నగేశ్, ఎమ్మె ల్యే బొజ్జు ప్రారంభించారు. బాదనకుర్తి, దాసునా యక్ తండా గ్రామాల్లో చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. సింగాపూర్ పెద్దమ్మతల్లి గుడిలో పూజలు చేశారు. నాయకులు భూ షణ్, మాజిద్, సత్యం, రమేశ్, సాజిద్, శంకర్, ర వీందర్, సంజీవ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.