
మెలకువలు పాటించాలి
కుంటాల: సోయా సాగులో మెలకువలు పా టించాలని హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌టీసీ శాస్త్రవేత్తలు బలిరామ్ నెనావత్, భారతి సూ చించారు. గురువారం మండలంలోని అందకూర్ శివారులోని సోయా పంటలను పరిశీ లించారు. సోయాలో కాండం తొలుచు పురు గు, వరిలో మొగి పురుగు నివారణ చర్యల గురించి వివరించారు. ఏవో విక్రమ్, ఏఈ వో గణేశ్, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్, పండరి, మల్లేశ్, కమలాకర్ తదితరులున్నారు.
ఘనంగా అటవీ
అమరవీరుల దినోత్సవం
సారంగపూర్: మండలంలోని చించోలి(బీ) సమీప గండిరామన్న అర్బన్ పార్కులోగల అటవీ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా అట వీశాఖ అధికారి షేక్ ఆదం నాగినిభానూ ఆ ధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. దాడులకు భయపడకుండా ధైర్యంతో అటవీశాఖ సిబ్బంది ప్రాణాల కు తెగించి అడవులను రక్షిస్తున్నారని తెలిపా రు. అనంతరం అడవుల రక్షణలో అసువులు బాసిన పలువురు కుటుంబీకులను సత్కరించారు. ఎఫ్‌ఆర్వోలు రామకృష్ణారావు, అని త, రాథోడ్ రమేశ్, రాథోడ్ అవినాష్, డెప్యూ టీ ఎఫ్‌ఆర్వోలు నజీర్‌ఖాన్, సంతోష్‌కుమార్, రాజశేఖర్, ఇర్ఫానుద్దీన్, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పాల్గొన్నారు.

మెలకువలు పాటించాలి