నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 7 2025 7:14 AM | Updated on Sep 7 2025 7:14 AM

నిర్మ

నిర్మల్‌

● నిర్మల్‌లో ఘనంగా నిమజ్జనోత్సవం ● శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎస్పీ ● వినాయకులకు స్వాగతం పలికిన ఉత్సవ సమితి ● గణనాథుల వరుసతో సందడి ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

7

నిమజ్జనంలో వరద సందేశం

సోన్‌: మండల కేంద్రంలో వినాయకుడి నిమజ్జ నం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వే డుకలో సువర్ణపురి యూత్‌ గణేశ్‌ మండలి వా రు ఏర్పాటు చేసిన సందేశం ఆకట్టుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని రైతు ల పొలాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘వ ర్షం కావాలి.. వరదలు వద్దు.. భూమి తడవా లి.. మునిగిపోవద్దు.. మా పాపాలను క్షమించు.. నీ చల్లని దీవెనలతో కాపాడు’ అంటూ శోభాయాత్ర రథంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రం శనివారం ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మార్మోగింది. పది రోజులపాటు మండపాల్లో భక్తుల పూజలు అందుకున్న వినాయకుడు, 11వ రోజు గంగమ్మ ఒడికి ఘనంగా తరలివెళ్లాడు. గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవార్‌పేట్‌లోని ‘వన్‌ నంబర్‌’ గణేశ్‌ మండపం వద్ద బీజేఎల్సీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిల, ఆర్డీవో రత్నకల్యాణి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత 2, 3, 4 నంబర్‌ మండపాల వద్ద కూడా పూజలు జరిగాయి. బ్యాండ్‌ మేళాలు, డీజే సంగీతం మధ్య ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సమితి సభ్యులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. శోభాయాత్రలో చిన్నారులు, యువత, మండప నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజే పాటలు, బ్యాండ్‌ చప్పుళ్ల నడుమ గల్లీల వారీగా గణపతిని శోభాయాత్రలో ముందుకు తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలతో నిర్మల్‌ పట్టణంలో పండుగ వాతావరణం కనిపించింది. భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించింది.

శాంతియుత నిర్వహణకు పిలుపు

శోభాయాత్ర ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మల్‌ ప్రజలందరూ కలిసి నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరా రు. ‘‘పది రోజుల గణేశ్‌ నవరాత్రులను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశాం. అదే ఉత్సాహంతో శోభాయాత్రను విజయవంతం చేద్దాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా మేము అండగా ఉంటాం,’’ అని హామీ ఇచ్చారు. ఎస్పీ జానకీ షర్మిల శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర నిర్వహించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ‘‘ప్రజల భద్రతకు మా శాఖ ప్రాధాన్యత ఇస్తుంది,’’ అని ఆమె స్పష్టం చేశారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

నిమజ్జనోత్సవం శాంతియుతంగా జరిగేలా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏడు సెక్టార్‌లలో 323 మంది కానిస్టేబుళ్లు, 31 మంది మహిళా కానిస్టేబుళ్లు, 106 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 34 మంది ఎస్‌ఐలు, 11 మంది సీఐలు, ఏఎస్పీలు భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా కొనసాగుతోంది.

సేవా కార్యక్రమాలు..

శోభాయాత్ర సందర్భంగా పలు సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు సేవా కార్యక్రమాలను చేపట్టాయి. భాగ్యలక్ష్మి బ్యాంబు రెస్టారెంట్‌, మిల్క్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నగరేశ్వరవాడ చౌరస్తాలో మహా అన్నదానం నిర్వహించారు. అలాగే, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు భక్తులకు నీటి బాటిళ్లు, ప్రసాదం ప్యాకెట్లు అందించాయి.

నాలుగో‘సారీ’..

సారంగపూర్‌: జిల్లాలో ప్రసిద్ధ శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయ పరిసరాల్లో నిర్వహించే వివిధ వ్యాపారాలకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలం నాలుగోసారీ వాయిదా పడింది. కొబ్బరికాయలు విక్రయించే హక్కు, ప్యా లాలు పుట్నాలు విక్రయించే దుకాణం, బొమ్మలు, సీడీలు, కంకణాలు, మెమొరీకార్డులు విక్రయించే దుకాణం, టోల్‌ వసూలు హక్కులకు దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. వ్యాపారులు గతేడాదికన్నా ఎక్కువ పాడేందుకు ముందుకు రాలేదు. దీంతో వేలం వాయిదా వేశామని ఈవో రమేశ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ భోజాగౌడ్‌ తెలిపారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీన మళ్లీ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నిర్మల్‌1
1/8

నిర్మల్‌

నిర్మల్‌2
2/8

నిర్మల్‌

నిర్మల్‌3
3/8

నిర్మల్‌

నిర్మల్‌4
4/8

నిర్మల్‌

నిర్మల్‌5
5/8

నిర్మల్‌

నిర్మల్‌6
6/8

నిర్మల్‌

నిర్మల్‌7
7/8

నిర్మల్‌

నిర్మల్‌8
8/8

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement