
‘పరిషత్’ ఓటరు జాబితా విడుదల
నిర్మల్‌చైన్‌గేట్:మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓటరు ముసాయిదా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అధికారులు శనివారం ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు జిల్లాలో నోటిఫై చేయబడిన 157 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీల జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు. 8న జిల్లా, మండలస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించి, 9న అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా ప్రచురించనున్నారు.
ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు ఇలా..
ముసాయిదా ప్రకారం మండల పరిషత్‌ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు 892, ఓటర్లు 4,49,302 ఉన్నారు. ఇందులో పురుషులు 2,13,805, మహిళలు 2,35,485, ఇతరులు 12 మంది ఉన్నారు.
బీసీ రిజర్వేషన్లపైనే చర్చ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండటం, ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయడం వంటి అంశాలు అధికార పార్టీకి సవాల్ మారాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందన్నదానిపై చర్చ జరుగుతోంది.
పంచాయతీ డివిజన్లు 02
జెడ్పీటీసీ స్థానాలు 18
ఎంపీటీసీ స్థానాలు 157
పోలింగ్ కేంద్రాలు 892
మొత్తం ఓటర్లు 4,49,302
పురుషులు 213805
మహిళలు 235485
ఇతరులు 12