
ఎస్పీ కార్యాలయంలో వినాయక నిమజ్జనం
నిర్మల్‌టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నెలకొల్పిన వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జానకీషర్మిల వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గణేశ్ శోభాయాత్రను సంప్రదాయ పద్ధతిలో బ్యాండ్ మేళాలతో క్యాంప్ కార్యాలయం నుంచి ఎస్పీ ప్రారంభించి, పోలీస్ సిబ్బందితో స్థానిక బంగల్‌పేట్ చెరువు లో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్, రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ సీఐ కృష్ణ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.