
పోయిరా గణపయ్య..
గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎస్పీ జానకీషర్మిల, ఏఎస్పీ రాజేశ్‌మీనా, ఆర్డీవో రత్నకళ్యాణి తదితరులు
తానూరు : పదకొండు రోజులు విశేష పూజలందుకున్న తానూరు మండలం భోసిలోని కర్ర వినాయకుడి నిమజ్జనం శనివారం ఘనంగా ని ర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ ప్రతి నిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్ర ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల చివరి రోజు కర్ర వినాయకుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు చెల్లించుకున్నారు. శోభాయాత్రకు ముందు ఆలయంలో ఉట్టికొట్టి పూజలు నిర్వహించారు. కర్ర వినా యకుని లడ్డూను వేలంలో సంగారెడ్డి జిల్లా కొరిటికల్ మండలానికి చెందిన భక్తుడు శ్రీకాంత్‌రెడ్డి రూ,1,11,000 లకు సొంతం చేసుకున్నా రు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడ్డారు. బావి సమీపంలోకి తీసుకెళ్లి నీళ్లుచల్లి ప్రత్యేకంగా తయారు చేసి న బీరువాలో కర్ర వినాయకున్ని భద్రపరిచారు.
తెలంగాణ డప్పులపై.. తీన్మార్ స్టెప్పులు..
ఇక శోభాయాత్రలో తెలంగాణ డప్పు చప్పుళ్లు ప్రతిధ్వనించాయి. బ్యాండు మేళాల ముందు యువకులు తీన్మార్ స్టెప్పులేశారు. శోభాయాత్ర పొడవునా గణనాథునికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్షింతలు చల్లి దీవించమని వేడుకున్నారు. అందరిని చల్లంగా కాపాడుతూ ఆరోగ్యంగా ఉంచాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావ్, వీడీసీ అధ్యక్షుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పోయిరా గణపయ్య..

పోయిరా గణపయ్య..