
దిగుమతి సుంకాలు ఉపసంహరించుకోవాలి
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపైన 11శాతం దిగుమతి సుంకాలను ఉపసంహరించుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మో ర్చా జాతీయ కమిటీ పిలుపు మేరకు బుధవారం ప ట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పత్తి రైతులకు న ష్టం చేకూర్చేలా వివిధ దేశాల్లో వచ్చే పత్తికి దిగుమతి సుంకాలను తగ్గిస్తూ మన దేశ రైతులకు నష్టమయ్యే పరిస్థితిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువస్తోందని ఆరోపించారు. ఓ వైపు పెట్టుబ డులు రాక, గిట్టుబాటు లేక పత్తి రైతులు ఆందోళన చెందుతుంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అ మలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్, జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు భూక్య రమేశ్, నాగెల్లి నర్సయ్య, గోరెబాయ్, బీ నర్సయ్య, నారాయణ, భీమేశ్, రాజేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.