పల్లెల్లో ‘స్థానిక’ సందడి | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో ‘స్థానిక’ సందడి

Sep 3 2025 4:07 AM | Updated on Sep 3 2025 4:07 AM

పల్లెల్లో ‘స్థానిక’ సందడి

పల్లెల్లో ‘స్థానిక’ సందడి

పంచాయతీల వారీగా తుది ఓటరు జాబితా ప్రకటన జోరందుకున్న ఎన్నికల సందడి సమరానికి సిద్ధమవుతున్న ఆశావహులు 10న పరిషత్‌ ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఇటీవలి వరకు గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామీణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సెప్టెంబర్‌ 10న పరిషత్‌(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలు ప్రకటించనున్నారు. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవుతుండగా, ఆశావహులు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌..

గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటింది. సాంకేతిక సమస్యల కారణంగా ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల గణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లను ప్రకటించింది. గవర్నర్‌ ఆమోదం లేనప్పటికీ, అసెంబ్లీలో పంచాయతీరాజ్‌, పురపాలక చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందింది. ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడంతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఆమోదం లభించింది.

ఓటర్ల జాబితా విడుదల..

మంగళవారం గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా 4,49,302 ఓటర్లు నమోదయ్యారు, వీరిలో 2,13,805 మంది పురుషులు, 2,35,485 మంది మహిళలు, 12 మంది ఇతరులు ఉన్నారు. సెప్టెంబర్‌ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం, సెప్టెంబర్‌ 10న తుది జాబితా ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పూర్తవుతుంది.

రాజకీయ పార్టీల్లో కదలిక..

ఎన్నికల ఆలస్యం కారణంగా రాజకీయ నాయకులు ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించలేదు. అయితే, అధికార కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. బీజేపీ సైతం అడపాదడపా సమావేశాలు నిర్వహించగా, బీఆర్‌ఎస్‌ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎన్నికల ప్రకటన తెరపైకి రావడంతో పార్టీల్లో కదలిక మొదలైంది. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైంది.

నోటిఫికేషనే తరువాయి..

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 19 నెలలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసి 13 నెలలు గడిచాయి. పరిపాలనా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరిషత్‌కు కలెక్టర్‌, మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. హైకోర్టు సెప్టెంబర్‌ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేయడంతో ఈ ఎన్నికల్లో బీసీ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. జిల్లాలో 18 మండలాల్లో 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ, 190 ఎంపీటీసీ స్థానాల్లో 66 బీసీలకు దక్కే అవకాశం ఉంది, జెడ్పీ చైర్మన్‌తోసహా బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించనుంది.

గ్రామ పంచాయతీలు, వార్డులు,

ఓటర్ల వివరాలు..

మండలం జీపీలు వార్డులు ఓటర్లు

దస్తురాబాద్‌ 13 102 12,894

కడెం 29 242 29,159

ఖానాపూర్‌ 25 192 23,657

పెంబి 24 152 10,886

మామడ 27 222 26,072

లక్ష్మణచాంద 18 162 24,577

నిర్మల్‌ రూరల్‌ 20 170 22,751

సారంగాపూర్‌ 32 282 39,516

సోన్‌ 14 132 21,801

దిలావర్‌పూర్‌ 12 108 18,744

నర్సాపూర్‌(జి) 13 120 20,238

లోకేశ్వరం 25 224 29359

కుంటాల 15 134 19,055

భైంసా 30 258 33,970

ముధోల్‌ 19 166 28,754

తానూర్‌ 32 268 31,516

బాసర్‌ 10 90 15,728

కుభీర్‌ 42 344 40,625

పంచాయతీ డివిజన్లు 02

మొత్తం మండలాలు 18

గ్రామపంచాయతీలు 400

వార్డులు 33,68

మొత్తం ఓటర్లు 4,49,302

పురుషులు 2,13,805

మహిళలు 2,35,485

ఇతరులు 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement