
పంటలను పరిశీలించిన సబ్ కలెక్టర్
బాసర: భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన భవనంలో సాధారణ భక్తుడిగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం, తహసీల్దార్ పవన్ చంద్రతో కలిసి గోదావరి ఉధృతికి మునిగిన ప్రాంతాలను, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. గోదావరి బ్రిడ్జి పైనుంచి ప్రవాహాన్ని పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గణపతి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఫోకస్ లైట్లు, విద్యుత్ అలంకరణ, గజ ఈతగాళ్లు, బోటింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పంట నష్టపోయిన రైతులు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని తహసీల్దార్ పవన్‌చంద్రకు వినతిపత్రం ఇచ్చారు. దెబ్బతిన్న స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.