
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్‌దే
సారంగపూర్: ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఇన్‌చార్జి రాంభూపాల్‌వర్మ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బొల్లోజి నర్సయ్య, నాయకులు రాంశంకర్‌రెడ్డి, ఎంబడి రాకేశ్ పాల్గొన్నారు.