
బురదలో దిగి.. పంటలను పరిశీలించి..
లక్ష్మణచాంద: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మండలంలో దెబ్బతిన్న పంటలను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మంగళ వారం పరిశీలించారు. తిర్పెల్లి గ్రామంలోని వాగు బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి పైభాగం కొట్టుకుపోవడంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చామన్‌పల్లి, చింతల్‌చాంద, మునిపల్లి, పీచర, ధర్మారం, పార్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. వర్షాలతోపాటు ఉప్పొంగి న గోదావరి ప్రవాహానికి దెబ్బతిన్న పంటలను బురదలో దిగి పరిశీలించారు. నష్టం వివరాలు నమోదు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయన వెంట రావుల రాంనాథ్, భూపాల్‌రెడ్డి, చిన్నయ్య, ముత్యంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సురేశ్, లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్, రాజారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు.