
కాళేశ్వరంపై దుష్ప్రచారం మానుకోవాలి
నిర్మల్‌టౌన్: కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్‌కిషన్‌రెడ్డి అన్నారు. అధిష్టానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రామ్‌కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగించడం ప్రాజెక్టును మూసేయడమని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ సర్కార్ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, భూషణ్‌రెడ్డి, డాక్టర్ సుభాష్‌రావు, గండ్రత్ రమేశ్, అక్రమ్ అలీ, నజీరుద్దీన్, మొహమ్మద్ నయీమ్, మహబూబ్, మాసూద్ అలీఖాన్, జుబేర్‌ఖాన్, మొహమ్మద్‌బిన్ అలీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.