
వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా ప్రజలందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకునికి మంగళవారం నిమజ్జన పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహదాత, వేలంలో లడ్డూ గెలుచుకున్న వారిని కలెక్టర్ సత్కరించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉద్యోగులు, సిబ్బంది వినాయకుని శోభాయాత్రను నిర్వహించారు. భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి, వినాయకసాగర్ (బంగల్ పేట్) చెరువులో గణనాథుని నిమజ్జనం చేశారు.