బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం | - | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

Sep 2 2025 6:50 AM | Updated on Sep 2 2025 7:36 AM

● క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతి ● భూభారతి’ ద్వారా పట్టాలు ● జిల్లా వ్యాప్తంగా 9,621 దరఖాస్తులు ● సన్న, చిన్నకారు రైతులకు మేలు మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 10లోu ● ఎస్పీ జానకీషర్మిల

న్యూస్‌రీల్‌

డ్రైవింగ్‌లో నో సెల్‌
ప్రమాదాలను నివారించి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లకు నో ఫోన్‌ నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది.

నిర్మల్‌

సామాన్యులకు అండగా పోలీసులు

నిర్మల్‌టౌన్‌: సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్‌ అధికా రులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు పరి ష్కరించాలని ఆదేశించారు. సామాన్యులకు అండగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని సూచించారు. పోలీసులసాయం కావాలనుకునేవారు ఠాణాలో నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక పనులు చేస్తున్నట్లు తెలిసినా సమాచారం ఇవ్వాలని కోరారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వేలాది రైతులకు హైకోర్టు శుభవార్త అందించింది. 2020, అక్టోబరు 12న ప్రభుత్వం జారీ చేసిన జీవో 112పై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఆగస్టు 26న తీర్పు వెలువడింది. ఈ తీర్పు సన్న, చిన్నకారు రైతులకు భూమి హక్కుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం చేసింది. 2014, జూన్‌ 2కు ముందు లిఖిత ఒప్పందాలతో భూములు కొనుగోలు చేసిన రైతులు, 2020, అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తు చేసినవారి భూములు క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

సాదాబైనామా భూముల సమస్య..

గ్రామీణ ప్రాంతాల్లో సాదాకాగితంపై భూములు కొనుగోలు చేసిన అనేకమంది రైతులు రిజిస్ట్రేషన్‌ లేకుండా హక్కులు కోల్పోయారు. ధరణి పోర్టల్‌ ప్రవేశానికి ముందు ఆర్వోఆర్‌ చట్టం కింద సాదాబైనామా ఒప్పందాలతో పట్టాలు జారీ అయ్యేవి. అయితే, ధరణి అమలులోకి వచ్చాక ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ప్రభుత్వం 2014 జూన్‌ 2కు ముందు సాదాబైనామా ఒప్పందాల ద్వారా భూములు కొన్నవారికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది. 2020, అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 9,621 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామా పత్రాలు చట్టపరంగా ధ్రువీకరించబడకపోవడంతో రైతులు భూమి హక్కులను రుజువు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూర్వ యజమానులు లేదా వారి వారసులు భూమిపై హక్కు కోసం కేసులు వేయడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. భూమి క్రయవిక్రయాల్లో సమస్యలు, పట్టాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, రాయితీలు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ధరణిలో సాదాబైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కాలమ్‌ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైకోర్టు తీర్పుతో లైన్‌క్లియర్‌

హైకోర్టు తీర్పుతో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించబడింది. ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత, రెవెన్యూ ఆధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో సమీప రైతుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేస్తారు. భూమి క్రయవిక్రయం యథార్థమని నిర్ధారణ అయితే, రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ చెల్లింపుతో క్రమబద్ధీకరిస్తారు. హైకోర్టు స్టే ఎత్తివేతతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 9,621 దరఖాస్తులకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది.

నిర్మల్‌చైన్‌గేట్‌: అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మక విజయమని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతిభవనంలో సోమవారం మాట్లాడారు. పంచాయతీరాజ్‌ చట్టసవరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చామని, నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్‌ ముందుకు వెళ్తుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20% టికెట్లు కేటాయించాలని జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుకు వినతిపత్రం అందించారు.

మండలాల వారీగా

సాదాబైనామా దరఖాస్తులు

బాసర 66

భైంసా 214

దస్తురాబాద్‌ 849

దిలావర్‌పూర్‌ 667

కడెం(పెద్దూర్‌) 1,012

ఖానాపూర్‌ 386

కుభీర్‌ 648

కుంటాల 341

లక్ష్మణచాంద 664

లోకేశ్వరం 824

మామడ 1,113

ముధోల్‌ 755

నర్సాపూర్‌(జి) 332

నిర్మల్‌అర్బన్‌ 48

నిర్మల్‌రూరల్‌ 576

పెంబి 73

సారంగాపూర్‌ 647

సోన్‌ 338

తానూర్‌ 67

రైతులకు ప్రయోజనాలు..

క్రమబద్ధీకరణతో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలకు అర్హత సాధిస్తారు. భూమి హక్కుల వివాదాలు తగ్గి, చట్టపరమైన గుర్తింపు లభించనుంది. ఈ తీర్పు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది, ముఖ్యంగా గతంలో నిరాశపడిన వారికి ఊరటనిచ్చే అవకాశం కల్పించింది.

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం1
1/3

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం2
2/3

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం3
3/3

బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement