
దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో వరద నష్ట నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు లబ్ధిదారుల ఎంపిక సర్వే, వనమహోత్సవంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ బడులను ఎప్పటికప్పుడు పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
నేను ఖానాపూర్ పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు వారసత్వంగా వచ్చిన ఇల్లు కూలిపోయింది. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి నన్ను ఆదుకోవాలి.
– చుక్కల శ్రీనివాస్, ఖానాపూర్
ఒర్రె పొలాన్ని ముంచుతోంది..
నాకు రాణాపూర్‌లో కెనాల్ వద్ద ఒర్రెను అనుకొని 1.25 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్లుగా కెనాల్ పనుల కారణంగా ఒర్రె నుంచి నీరు వచ్చి పొలంలోకి చేరుతుంది. దీంతో పంట మునిగి ఏటా లక్ష రూపాయలు నష్టం వాటిల్లుతుంది. ఒర్రె నీరు పొలంలోకి రాకుండా చూడాలి.
– కరిపే భోజన్న, రాణాపూర్
ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి
ఖానాపూర్ పట్టణంలో గతంలో పోస్ట్ ఆఫీస్‌లో ఆధార్ సెంటర్ ఉండేది. ప్రస్తుతం దానిని తొలగించారు. ఇప్పుడు పట్టణంలో ఒకే ఒక ఆధార్ సెంటర్ ఉంది. దానిని కూడా నిత్యం తెరవడం లేదు. మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
– అఖిల్, ఎంఐఎం అధ్యక్షుడు
అక్రమ కట్టడాలు ఆపాలి
గుల్జార్ మార్కెట్ నివాసి అయిన రఫీ అహ్మద్ ఖురేషి తన పాత ఇంటిని కూల్చివేసి మునిసిపల్ లో జి ప్లస్ వన్ నూతన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. ఈ విషయం పలుమార్లు మున్సిపల్ అధికారులకు, పట్ట ణ ప్రణాళిక అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణం పూర్తికావస్తుంది. – సోఫియాన్ సలీం, నిర్మల్

దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..

దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..

దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..

దరఖాస్తులు ఇచ్చి.. పరిష్కారం కోరి..