
ఏఈవో సంతకం ఫోర్జరీ
నిర్మల్: రైతుబీమా పత్రాలపై ఏఈవో సంతకం ఫోర్జరీ అయిన సంఘటన నర్సాపూర్(జి)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాక్‌పల్లి క్లస్టర్‌లో ఏఈవోగా కాల్వ రమ్య విధులు నిర్వహిస్తున్నారు. 2020, జూలై 14 నుంచి 45 రోజులు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో ఓ రైతుకు చెందిన రైతుబీమా పత్రాలపై ఏఈవో రమ్య సంతకం ఫోర్జరీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఫోర్జనీ సంతకం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఏఈవో రమ్యను సంప్రదించగా... తాను ఆ సమయంలో ప్రసూతి సెలవులో ఉన్నానని.. ఆ సంతకం తనది కాదని తెలిపారు. ఉన్నతాధికారులు విచారణ చేపడితే ఎవరు చేశారనేది తెలుతుందన్నారు.