
రాష్ట్రస్థాయి విజ్ఞానమేళాకు ఎంపిక
నిర్మల్‌చైన్‌గేట్/నిర్మల్ రూరల్ : పట్టణంలోని బుధవార్‌పేట్ శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల శిశువర్గ, కిషోరవర్గ విద్యార్థులు రాష్ట్రస్థాయి విజ్ఞాన మేళాకు ఎంపికయ్యారు. శిశువర్గలో క్విజ్‌లో ప్రథమ స్థానంలో విశ్వక్, నరసింహ, వరుణ్ తేజ మట్టితో విగ్రహల తయారీలో మధు ప్రియ ప్రథమ స్థానం, జానపద కథనంలో మగ్గిడి రితీశ్ ద్వితీయ స్థానం సాధించారని ప్రధానాచార్యులు కొండూరు నరేష్ తెలిపారు. ప్రథమ స్థానం పొందిన వారు ఈనెల 3, 4, 5 తేదీల్లో కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరిని పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, ఆచార్యులు అభినందించారు.