
‘అల్లోలపై ఆరోపణలు సరికాదు’
నిర్మల్ టౌన్: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ పలువు రు యువకులు సోషల్ మీడియాలో ఆరోపణ లు చేయడం సరికాదని డీసీసీబీ వైస్ చైర్మన్ ర ఘునందన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ని ర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నారని, ప్రజలు సమస్యలు చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, కూలిన ఇండ్లను అల్లోల పరిశీలించి బాధితులకు మనోధైర్యం కల్పించారని పేర్కొన్నారు. అల్లోలపై ఆరోపణలు చేస్తున్నవారు వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ యన వెంట నాయకులు రమణారెడ్డి, రాంచందర్, సత్యనారాయణ, శ్రీనివాస్, రాందాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్ తదితరులున్నారు.