
క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్
నిర్మల్‌టౌన్: భారత హాకీ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన క్రీడాదిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ అని హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాకాల రాంచందర్, జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం(మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి) సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధ్యాన్‌చంద్‌బంతిపై నియంత్రణ, అద్భుతం, నైపుణ్యం ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్‌చంద్‌ను హాకీ మాంత్రికుడిని చేశాయని వివరించారు. అనంతరం సీఎం కప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభగౌడ్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ అన్నపూర్ణగౌడ్, ట్రస్మా అధ్యక్షుడు చంద్రగౌడ్, పేటా అధ్యక్షుడు భూక్యా రమేశ్, సెక్రెటరీ భోజన్న, దీక్ష జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రవీందర్‌గౌడ్, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.