
పోలీసుల అప్రమత్తం
● పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఎస్పీ
నిర్మల్ టౌన్: జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎస్పీ జానకీషర్మిల క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. పోలీసులను సమన్వం చేస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షంతో మంచిర్యాల్ చౌరస్తా జలమయమై, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎస్పీ స్వయంగా పరిశీలించి, ట్రాఫిక్‌ను నియంత్రించి, వాహనాలను డైవర్ట్ చేశారు. సొన్ మండలం మాదాపూర్‌లో వాగు ఒడ్డున చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులు, 15 పశువులను డయల్ 100 సమాచారంతో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు కాపాడారు. ఎస్పీ బంగల్‌పేట్ చెరువు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, మత్స్యకారులు చెరువులోకి దిగవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు కొండాపూర్ బ్రిడ్జి వద్ద డైవర్ట్ అయి, మామడ, ఖానాపూర్, జగిత్యాల ద్వారా ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.