
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
భైంసారూరల్: నేరాల నియంత్రణకు సీసీ కెమెరా లు దోహదపడతాయని ఎస్పీ జానకీషర్మిల అన్నా రు. మండలంలోని తిమ్మాపూర్, వానల్‌పాడ్ వీడీసీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. భైంసా–నిర్మల్ జాతీయ రహదా రిపై తిమ్మాపూర్ వద్ద ప్రమాదహెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. తిమ్మాపూర్‌లోని నరసింహాస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంత రం మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఏమైన సమస్యలు ఉంటే డయల్ 100 ఫోన్ చేసి తెలుపాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ అవినాశ్‌కుమార్, సీఐ నైలు, ఎస్సై శంకర్, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు ఉన్నారు.