
అభ్యసన ఫలితాలు సాధించాలి
సోన్: విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా బోధించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణరెడ్డి అన్నారు. మండలం కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలతోపాటు వివిధ పాఠశాలలను డీఈవో రామారావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్రాథమిక తరగతులలో జరుగుతున్న తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థులను అభ్యసన ఫలితాలకు సంబంధిత ప్రశ్నలు అడిగి ప్రగతిని తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల వివరాలు యూడైస్‌లో నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు, ఎఫ్‌ఏ పరీక్ష ఫలితాలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్‌లు యూనిఫాంల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించారు. విద్యా సేవలను సీఆర్పీ సంధ్యారాణిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సహాయ కార్యదర్శి భానుమూర్తి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.