
స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ హాల్ పరిశీలన
ఖానాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లు లెక్కించేందుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ఆయా భవనాలను జెడ్పీ సీఈవో గోవింద్ మంగళవారం పరిశీలించారు. మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో రత్నాకర్‌రావుతో కలిసి పాఠశాల, కళాశాల గదులను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జెడ్పీ సీఈవో గోవింద్ సూచించారు. పట్టణంలోని ఎంపీపీ కార్యాలయ సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులతో సమవేశం నిర్వహించారు. ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక, మొరం ఇక్కట్లు లేకుండా చూడాలన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వారికి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, ఎంపీడీవో రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.