
చట్టాలపై అవగాహన ఉండాలి
మామడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాసంస్థ చైర్‌పర్సన్, సీని యర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి ఒక లక్ష్యం నిర్ణయించుకుని తల్లిదండ్రులకు తెలి యజేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం ద్వారా బాల్య వివాహాలను అరికట్టవచ్చని తెలిపారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తునే సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ చట్టా ల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం అరవింద్‌కుమార్, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ.లింగన్న, ప్రధాన కార్యదర్శి రావుల హన్మంత్‌రెడ్డి, ఖానాపూర్ సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, వైద్యాదికారి స్వాతి, పారా లీగల్ వాలంటీర్స్ జనార్దన్, పోతన్న, రాజేశ్వర్, కిషన్‌రావ్, రాజేశ్వర్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.