
ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి
నిర్మల్ రూరల్: జిల్లాలో ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎస్జీటీలకు మంగళవారం రాత్రి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం రాత్రంతా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. పీఎస్ హెచ్‌ఎంలుగా 34 మందికి, స్కూల్ అసిస్టెంట్ గణితం 6, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 9, సోషల్ స్టడీస్ 17, తెలుగు 5, హిందీ 1, ఇంగ్లిష్ 5 మొత్తం 78 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ లభించాయి. బుధవారం సెలవు ఉన్నప్పటికీ వీరంతా ఆయా పాఠశాలలో జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తీజ్ సంబురం
కుంటాల: మండలంలోని ఓలా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ తండాలో మంగళవారం మహిళలు తీజ్ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ వేషధారణతో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం గోధుమనారును నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో తండా పెద్దలు శంకర్ నాయక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.