
మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ
నిర్మల్‌చైన్‌గేట్: మహిళలు విభిన్నరంగాల్లో స్వయం ఉపాధి పొందేలా శిక్షణ అందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం చించో లి సమీపంలోని మహిళా ప్రాంగణంలో జరుగుతు న్న శిక్షణ కార్యక్రమాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కుట్టుమిషన్, అల్లికలు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, పేపర్ బ్యాగ్ తయారీ, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసి, అధిక సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవా లని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు విజయలక్ష్మి, మోహన్‌సింగ్, నరసింహారెడ్డి, శంకర్ పాల్గొన్నారు.