
జాగ్రత్తలతో విద్యుత్ ప్రమాదాల నివారణ
నిమజ్జన శోభాయాత్రలో ఉపయోగించే ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు టైర్లు, బ్రేకులు సరిగ్గా పనిచేసే స్థితిలో ఉన్నవి మాత్రమే అద్దెకు తీసుకోవాలి.
వాహనాలను నడిపేందుకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలి. కొత్త డ్రైవర్లకు వాహనాలను అప్పగించరాదు.
ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, ప్రాజెక్టులు నీటితో నిండి ఉన్నాయి. నిమజ్జనం కోసం చీకటి పడకముందే ఏర్పాట్లు పూర్తి చేయాలి.
నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి, తద్వారా సురక్షితంగా నిమజ్జనం జరిగేలా చూడాలి.
నిమజ్జనం సమయంలో ఒడ్డు నుంచే విగ్రహాలను నీటిలోకి వదలాలి. ఎక్కువ లోతులోకి వెళ్లడం, ఈత రాని వారిని నీటిలోకి పంపడం వంటివి కచ్చితంగా నివారించాలి.
భైంసా: వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో మండపాల్లో గణనాథులు కొలువుదీరనున్నారు. దీంతో మండపాలను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలంకరణలో, నిమజ్జన ఊరేగింపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏడీఈ ఆదిత్య తెలిపారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు వేలాడడం, షార్ట్ సర్క్యూట్‌లు, ఎర్తింగ్ వైర్లలో విద్యుత్ సరఫరా వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. విగ్రహాలను తరలించే సమయంలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద వేలాడే విద్యుత్ తీగలు తాకితే షాక్ కొట్టే ప్రమాదం ఉందని తెలిపారు.
మండపాల వద్ద జాగ్రత్తలు..
నిమజ్జన శోభాయాత్రలో జాగ్రత్తలు..