
ఆశ వర్కర్ల పోరుబాట
నిర్మల్‌చైన్‌గేట్: ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేశ్ మాట్లాడారు. ఆశ వర్కర్లు పారి తోషికాలు తగ్గించాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో చెల్లించినట్లు మొత్తం డబ్బులు ప్రతినెలా చివరి నాటికి ఖాతాల్లో జమ చేయాలన్నారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వర కు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు ప్రమోషన్ కల్పించాలని లేదంటే వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.గంగమణి, ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.సుజాత, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ, విజయ, అనసూర్య, సరిత, ఇంద్రమాల, నంద, జిల్లా సహా య కార్యదర్శులు సులోచన, మౌనిక, విజయ, శ్యామల, పద్మ, కమల, జ్యోతి, లక్ష్మి పాల్గొన్నారు.
ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ అన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం రద్దు చేయాలన్నారు. పీఎంశ్రీ, ప్రీస్కూల్ విద్యను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థులు పోషకాహారానికి, ఆరోగ్య పరీక్షలకు దూరమవుతారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.లలిత, ఉపాధ్యక్షులు గంగమణి, రాజమణి ఉన్నారు.