
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్ టౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సోమవారం సమావేశం నిర్వహించారు. రానున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు మతపరమైన విభేదాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. గణేశ్ పండుగ మొదలుకుని, విగ్రహాల నిమజ్జనం వరకు చాలా క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రజల సహకారంతోనే పోలీస్ విభాగం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపడుతుందని తెలిపా రు. సమావేశంలో నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సామాన్యులకు అండగా పోలీసులు
సామాన్యులకు పోలీసులు అండగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల సూచించారు. పోలీస్ కా ర్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నా ణ్యమై న పోలీసింగ్‌ను ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.