
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్ టౌన్: కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని తపస్ జిల్లా అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్‌కుమార్, సుదర్శ న్ కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉపాధ్యా య ఎమ్మెల్సీ మల్క కొమురయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. విద్యారంగంలో సేవలందిస్తూ, వేతనాలు, ఉద్యోగ భద్రత విషయంలో వివక్షకు గురవుతున్న ఉపాధ్యాయ వర్గాలకు సరైన న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ వేతనాలు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధించాలని కోరారు.