
సప్తవర్ణాల ‘స్వర్ణ’
సారంగపూర్: మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధికసంఖ్యలో వస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు తాకిడి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1,183 అడుగులు కాగా, ప్రస్తుతం 1,151.9 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తకున్నా లీకేజీల రూపంలో నీరు అధికంగా బయటకు వెళ్లడాన్ని సందర్శకులు తిలకిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.