
టీచర్స్‌డే ఘనంగా నిర్వహించాలి
నిర్మల్ టౌన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా రాజేశ్‌నాయక్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఆయన మాట్లాడారు. వృత్తిపరంగా నైపుణ్యం కనబరిచి బోధనతో పాటు విద్యార్థుల అభివృద్ధికి పా టుపడుతున్నవారిని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డి మాండ్ చేశారు. ప్రతిభ గల ఉపాధ్యాయులను అప్లికేషన్ లేని విధానంలో అవార్డులకు ఎంపిక చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, ఉపాధ్యక్షుడు మధుకర్ తదితరులున్నారు.