
6న గణేశ్ నిమజ్జనం
నిర్మల్‌చైన్‌గేట్: గణపతి నవరాత్రోత్సవాల్లో భా గంగా ఈ నెల 27న విగ్రహాలను నెలకొల్పాలని పండితులు బురుగంటి గుణవంతురావు జోషి, గుడి రాజేశ్వర్‌శర్మ సిద్ధాంతి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక దేవరకోట దేవస్థానంలో ఆదివారం వేదపండితుల సమావేశం నిర్వహించగా వారు మాట్లాడారు. వచ్చేనెల 7న చంద్రగ్రహణం ఉన్నందున 6న పద్మనాభ అనంత చతుర్దశి రోజే నిమజ్జనం చేయాలని సూచించారు. సమావేశంలో గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మూర్తి ప్రభాకర్, వీ హెచ్‌పీ నాయకులు పతికి రాజేందర్, ముప్పిడి రవి, దొనగిరి మురళి, గజవాడ కపాల్, సాధం ఆనంద్, పాతర్ల నరేశ్, జట్టి నరేందర్, కూన సతీశ్, న్యామతాబాద్ సాయికుమార్, గడిచర్ల జనార్దన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న పండితులు, నాయకులు