
పాండురంగ్‌కు డాక్టరేట్
తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన బోనోడ్ పాండురంగ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేసింది. పాండరంగ్ హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ పీ రాజ్యశ్రీమమోరే పర్యవేక్షణలో ‘నాయి సదికే ఉపన్యాసోమే’ అనే అంశంపై విశ్లేషణాత్మక అధ్యయనం చేసి గ్రంథాన్ని సమర్పించగా యూనివర్సిటీ అధికారులు పరి శీలించి డాక్టరేట్‌కు ఎంపిక చేశారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఇస్రో చైర్మన్ వీ నారాయణ్ తదితరుల చేతుల మీదుగా పాండురంగ్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధువులు అతడిని అభినందించారు.