
జలాశయాలకు జనకళ
న్యూస్‌రీల్
నిర్మల్
మితిమీరితే అనర్థమే..
మోతాదుకు మించి యూరియా, డీఏపీ వాడొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రసాయన ఎరువులతో నేల నిస్సారంగా మారుతుందని పేర్కొంటున్నారు.
ఆలయాభివృద్ధికి కృషి
భైంసాటౌన్: పట్టణంలోని ఏకముఖ హనుమా న్ ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మె ల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణ్‌రావు పటేల్ హామీ ఇచ్చారు. హనుమాన్ ఆ లయం వరకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ.18 లక్షల నిధులు మంజూరు చేయించి ఆ దివారం ఆలయ కమిటీ సభ్యులకు ప్రొసీడింగ్ అందజేశారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం నారాయణ్‌రావు పటేల్ మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు శంకర్ చంద్రే తదితరులున్నారు.
భైంసా: పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుని సందర్శకులకు ఆహ్లాదం పంచుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. భైంసా పట్టణంతోపాటు సమీప గ్రామాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చిన జ నం ప్రాజెక్ట్ అందాలను తిలకించారు. చల్లగాలులు వీస్తుండగా జల సవ్వడులు చూస్తూ సేదదీరారు. ప్రాజెక్ట్ అందాలను కెమెరాల్లో బంధించారు. సెల్ఫీ లూ తీసుకున్నారు. కాగా, సందర్శకులు గేట్ల వైపు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆహ్లాదం పంచుతోంది
నేను మా కుటుంబంతో కలిసి ప్రాజెక్ట్ వద్దకు వచ్చాను. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణం బాగుంది. సెలవు రోజుల్లో ఎక్కువసార్లు ఇక్కడికే వస్తుంటాం. కుటుంబంతో కలి సి ఇక్కడ గడిపితే ఆ అనుభూతే వేరు. ప్రతీ సంవత్సరం గేట్లు ఎత్తే సమయంలో వచ్చి ఇక్కడి దృశ్యాలను చూస్తుంటాం. – సాయినాథ్, సందర్శకుడు
ప్రాజెక్ట్ చూసేందుకు వచ్చా
నేను భైంసాలో వ్యాపారం నిర్వహిస్తుంటాను. ప్రతీరోజు పనిలో భాగంగా దుకాణంలోనే ఎక్కువ సేపు గడుపుతుంటాను. వానాకాలం కావడంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చింది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో సరదాగా ఫ్యామిలీతో కలిసి చూద్దామని ఇక్కడకి వచ్చాను. – గంగాధర్, సందర్శకుడు
ఉల్లాసంగా ఉంటుంది
భైంసా పట్టణంలో ఎక్కడా పార్కు లేదు. స్నేహితులమంతా ప్రాజెక్ట్ వద్దకే ఎక్కువగా వస్తుంటాం. ఇక్కడి వాతావరణం బాగుంటుంది. పక్కనే ఉన్న గుట్ట పైనుంచి నీటి దృశ్యాలు చూస్తే మనస్సు ఉప్పొంగుతోంది. అయితే.. ప్రాజెక్ట్ వద్ద బెంచీలు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతి కల్పించాలి. – గజ్జారాం, సందర్శకుడు

జలాశయాలకు జనకళ

జలాశయాలకు జనకళ

జలాశయాలకు జనకళ

జలాశయాలకు జనకళ