
తండాల్లో తీజ్ సంబురం
లోకేశ్వరం: మండలంలోని సేవాలాల్ తండావాసులు ఆదివారం తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. తండాలోని పెళ్లికాని యువతులు తొమ్మిదిరోజులపాటు నియమనిష్టలతో ఉపవాసాలుండి స్థానిక జగదాంబ మందిరంలో ప్రత్యేకపూజలు చే శారు. చివరిరోజు నిర్వహించిన తీజ్ ఉత్సవాల సందర్భంగా చిన్నాపెద్దా తేడా లేకుండా లంబాడా మ హిళలు ప్రధాన వీధుల గుండా నృత్యాలు చేశారు.
నిర్మల్: మండలంలోని అంజనీతండా, రాంపూర్ పంచాయతీ పరిధిలోని దర్యాపూర్ గ్రామంలో బంజారాలు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువతులు తొమ్మిదిరోజులపాటు మట్టి నింపిన బుట్టల్లో గోధుమ గింజలు చల్లి నీటిని అందించారు. ఆదివారం మొలకెత్తిన గోధుమ నారు బుట్టలను నెత్తినెత్తుకుని ఆడిపాడారు. కుల దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక చెరువులో గోధుమనారు బుట్టలను నిమజ్జనం చేశారు.

తండాల్లో తీజ్ సంబురం