
మానవ్వకు ఇల్లు రాలే..
కుంటాల: మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన మక్కాయి మానవ్వ–సుధాకర్ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు నివాసముండే పాత పెంకుటిల్లు గతేడాది భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో యాదవ సంఘం సభ్యులు సంఘ భవనంలో వీరికి ఆశ్రయమిచ్చారు. ఇందిరమ్మ ఇంటి కోసం మానవ్వ దరఖాస్తు చేసుకుంది. ఇటీవల సర్వే కోసం వచ్చిన అధికారులు మానవ్వ దంపతులు ఆశ్రయం పొందిన సంఘ భవనా నికి స్లాబ్ ఉందని ఎల్–3 (ఇల్లు ఉన్నట్లు) లో ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం ఇంటి స్థలం ఉన్న ఈమెను ఎల్–1లో ఎంపిక చేయకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదు. దీంతో తమకు అన్యాయం జరిగిందని మానవ్వ దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం పలుసార్లు స్థానిక అధికారులను కలిసినా తమ చేతిలో ఏమీ లేదని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

మానవ్వకు ఇల్లు రాలే..