
కట్టి పడేసే అందాల ‘కడెం’
బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటకులు
బోటింగ్ చేస్తున్న పర్యాటకులు
కడెం: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైనా కడెం ప్రాజెక్ట్ సందర్శకులకు ఆహ్లాదం పంచుతోంది. వీకెండ్స్.. హాలీడేస్‌లలో పర్యాటకులతో సందడిగా మారుతోంది. ఆదివారం హైదరా బాద్, జగిత్యాల, మంచిర్యాల తదితర సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు బంధుమిత్రులు, మిత్రబృందంతో కలిసి ప్రాజెక్ట్ అందాలను తనివి తీరా తిలకించారు. ప్రాజెక్ట్‌లో బోటింగ్ చేస్తూ సెల్ఫీలు దిగారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇక్కడే గడిపారు.
ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి
ప్రకృతి అందాలతో కడెం ప్రాజెక్ట్ పరిసరాలు చాలా బాగున్నాయి. ప్రాజెక్ట్ అందాలు చూస్తూ ఉంటే దినమంతా ఇట్టే గడిచిపోయింది. పురాతన కడెం ప్రాజెక్ట్ నిర్మాణ శైలి నేటి విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని పంచుతుంది. అయితే పర్యాటకులకు ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. – దివ్య, పర్యాటకురాలు,హైదరాబాద్
పాపికొండలను తలపించింది
ఫ్రెండ్స్‌తో కలిసి కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించాను. ప్రాజెక్ట్ అందాలను తిలకించడం, సహ్యాద్రి కొండల అంచున ప్రాజెక్ట్‌లో బోటింగ్ చేయడం పాపికొండలను తలపించింది. రోజంతా మిత్రులతో కలిసి చాలా ఎంజాయ్ చేశాం. ఇక్కడి అందాలు చూసేందుకు మళ్లీమళ్లీ రావాలనిపిస్తోంది.
– చంద్రశేఖర్, విజయవాడ

కట్టి పడేసే అందాల ‘కడెం’

కట్టి పడేసే అందాల ‘కడెం’

కట్టి పడేసే అందాల ‘కడెం’