
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీలకు ప్రాధాన్యం కల్పించ
నిర్మల్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీ లకు తగిన ప్రాధాన్యం కల్పించాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో తుడుం దెబ్బ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ.. ఎస్టీ రిజర్వేషన్ స్థానాల్లో ఆదివాసీలకే సీట్లు కేటాయించి వారిని గెలిపించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ తెగలకు సీట్లు కేటాయించిన పార్టీలకే పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ఆదివాసీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పోడు భూములు సాగు చే సుకుంటున్న ఆదివాసీలపై అటవీ అధికారుల దా డులు ఆపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ, ఫారెస్ట్ అధికారులు కావా లని అడ్డుకుని మొక్కలు నాటుతున్నారని ఆరోపించారు. సమావేశంలో జేఏసీ జిల్లా కన్వీనర్ మంద మల్లేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తోడుసం గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు పోతురాజు శ్రీనివాస్, బోర్ర భీమేశ్, శ్రీనివాస్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.