
విశ్వబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి
బాసర: విశ్వబ్రాహ్మణులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కోరారు. బాసరలో ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభ, రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ సంఘంలో రాజకీయంగా అన్ని అర్హతలు కలిగి నాయకులున్నారని, వారికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ, గ్రామ, మండ ల స్థాయిలో సంఘం కార్యక్రమాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తానని మధుసూదనాచా రి తెలిపారు. అనంతరం శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం ప్రతి నిధులతో కలిసి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌చారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పుమేలవాడ మదన్‌మోహన్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు, ఆయా మండలాలు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.