
నిబంధనల మేరకే వేడుకలు
మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి.
ఆన్‌లైన్ పోర్టల్ https:// policeportal. tspolice. gov. in ద్వారా వివరాలను నమోదు చేయాలి.
దరఖాస్తు తర్వాత జనరేట్ అయ్యే QR కోడ్‌ను మండపం వద్ద పోలీస్ అధికారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి.
మండపం విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండేలా స్థాపించాలి.
విద్యుత్‌శాఖ అనుమతితో మాత్రమే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.
మండపం వద్ద నీటితో నిండిన బకెట్, ఇసుకతో నిండిన బకెట్‌ను అందుబాటులో ఉంచాలి.
అగ్ని ప్రమాద జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
రాత్రి లేదా పగలు, ఎల్లప్పుడూ కనీసం ఇద్దరు వ్యక్తులు మండపం వద్ద ఉండేలా చూసుకోవాలి.
చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బంది కలిగించే అధిక శబ్ద స్థాయిలతో లౌడ్‌స్పీకర్లను ఉపయోగించరాదు.
డీజే వంటి అధిక శబ్ద కాలుష్యం కలిగించే సాధనాలను నిషేధించాలి.
గణేష్ స్థాపన లేదా నిమజ్జనం గురించి సామాజిక వర్గాలకు ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయరాదు.
ఊరేగింపును నడిపించే బాధ్యతను కనీసం ఇద్దరు వ్యక్తులకు అప్పగించాలి.
ఒకరు ట్రాఫిక్ నిర్వహణకు మార్గనిర్దేశం చేయాలి, మరొకరు ఊరేగింపును సరైన మార్గంలో నడిపించాలి.
ఊరేగింపు ఇరువైపులా తాళ్లు పట్టుకోవడానికి కనీసం నలుగురు వ్యక్తులు ఉండాలి.
క్రాకర్లను బహిరంగ, విశాలమైన ప్రదేశాల్లో మాత్రమే వెలిగించాలి.
రోడ్లపై జనసంచారం ఎక్కువగా ఉండే సమయంలో ఊరేగింపుల సమయంలో క్రాకర్లను వెలిగించరాదు.
నిమజ్జన ఊరేగింపు నిర్ణీత సమయానికి ప్రారంభం కావాలి.
రసాయన సంబంధిత రంగులు, ఇతర పౌడర్లను చల్లడం నిషేధం.
చెరువులు, వాగుల వద్ద నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి లేదా 100 నంబర్‌కు డయల్ చేయాలి.
నిర్మల్ టౌన్: మరో నాలుగు రోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేడుకల కోసం ఊరూరా.. వాడవాడలా మండపాలు సిద్ధమవుతున్నాయి. గణనాథులు కూడా కొలువుదీరేందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో మండపాల నిర్వాహకులకు ఎస్పీ జానకీషర్మిల కీలక సూచనలు చేశారు. అందరూ నిబంధనల మేరకే వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. సురక్షితమైన, సామరస్యపూర్వకంగా ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు.
నిర్వహణ జాగ్రత్తలు..
అనుమతి తప్పనిసరి..
విద్యుత్ జాగ్రత్తలు..
అగ్ని ప్రమాద నివారణ..
సీసీ కెమెరాల ఏర్పాటు..
శబ్ద కాలుష్య నియంత్రణ..
నిమజ్జన ఊరేగింపు సూచనలు..
ఊరేగింపు నిర్వహణ..
క్రాకర్ల వినియోగం..